కాంగ్రెస్‌లో BRS విలీనంపై KCR సంచలన వ్యాఖ్యలు

పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ కాంగ్రెస్‌లో BRS విలీనంపై స్పందించారు. విలీనం చేస్తామని చెప్పిన మాట వాస్తవమే అన్నారు.

Update: 2024-04-23 13:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ కాంగ్రెస్‌లో BRS విలీనంపై స్పందించారు. విలీనం చేస్తామని చెప్పిన మాట వాస్తవమే అన్నారు. కానీ, తన డిమాండ్లకు కాంగ్రెస్ పెద్దలు ఒప్పుకోకపోవడంతో విలీనానికి తర్వాత నిరాకరించానని వెల్లడించారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచాం. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని అద్భుతంగా పాలించామని తెలిపారు. ఇప్పుడు మళ్లీ ప్రజలు కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారని అన్నారు. కానీ, ప్రజల నమ్మకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు అన్నారు. వంద రోజుల్లోనే వారి పనితీరుపై ప్రజల్లో అసహనం పెరిగిపోయిందని చెప్పారు. అడ్డగోలు హామీలు ఇచ్చిన అధికారంలోకి వచ్చిందన్నారు. హామీలు అమలు చేయడం చేతకాక, బీఆర్ఎస్‌ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఎదురుదాడికి దిగుతున్నారని మండిపడ్డారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు రియలైజ్ అవుతున్నారని అన్నారు. మోసపోయినట్లు గ్రహించారని తెలిపారు.

Read More...

RS ప్రవీణ్ కుమార్‌పై KTR ప్రశంసల వర్షం.. ధీరుడు, వీరుడు అంటూ పొగడ్తలు

Tags:    

Similar News