విపక్షాల బాటలో కేసీఆర్.. ఆ మాటల వెనుక ఆంతర్యం ఇదేనా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ భవన్ లో జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన కేసీఆర్ రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని, నేతలంతా ప్రజల్లోకి వెళ్లాలని దిశానిర్దేశం చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ భవన్ లో జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన కేసీఆర్ రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని, నేతలంతా ప్రజల్లోకి వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించుకోవాలని సూచించారు. అయితే, అనూహ్యంగా కేసీఆర్ పాదయాత్రలపై నేతలు దృష్టి సారించాలని నేతలకు చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో పాదయాత్రల ట్రెండ్ కొనసాగుతోంది. బండి సంజయ్ ఇప్పటికే ఐదు విడతల ప్రజాసంగ్రామ యాత్ర పూర్తి చేసుకోగా ‘హాత్ సే హాత్ జోడో యాత్ర’ పేరుతో రేవంత్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తున్నారు.
వీరితో పాటు షర్మిల, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌లు పాదయాత్రలనే నమ్ముకున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలతో మమేకం అవ్వాలంటే తమ పార్టీ సైతం పాదయాత్ర చేయాలనే ఆలోచనతో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇది నియోజకవర్గ స్థాయి నేతల వరకే పరిమితం అవుతుందా లేక కేటీఆర్ వంటి అగ్రనేతలు లీడ్ తీసుకుంటారా? అనేది చర్చనీయాంశంగా మారింది. పాదయాత్ర కాకపోయినా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ కేటీఆర్, హరీష్ రావు, కవిత స్థాయిలో రాష్ట్రమంతటా బస్సు యాత్ర ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదనే కేసీఆర్ మాటలను బట్టి అర్థం అవుతోందనే చర్చ జరుగుతోంది.
Read more: