నేడు కొండగట్టుకి సీఎం కేసీఆర్
నేడు సీఎం కేసీఆర్ జగిత్యాల జిల్లాలోని కొండగట్టులో పర్యటించనున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: నేడు సీఎం కేసీఆర్ జగిత్యాల జిల్లాలోని కొండగట్టులో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు ప్రగతి భవన్ నుంచి సీఎం కేసీఆర్ కొండగట్టుకి బయల్దేరి వెళ్లనున్నారు. అంజన్న ఆలయంలో సీఎం ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నారు. యాదాద్రి తరహా అభివృద్ధి కోసం అంజన్న ఆలయాన్ని పరిశీలించనున్నారు. అనంతరం కొండగట్టులో మౌలిక సదుపాయాలపై సీఎం సంబంధిత శాఖ అధికారులతో చర్చించనున్నారు.
ఉదయం 9 గంటలకు రోడ్డు మార్గంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్ లో బయలుదేరతారు. 9.40 గంటలకు కొండగట్టు సమీపంలోని జేఏన్టీయూ కళాశాల ఆవరణలో హెలికాప్టర్ దిగి రోడ్డు మార్గంలో అంజన్న కొండపైకి చేరుకుంటారు. అయితే ఇటీవల సీఎం కేసీఆర్ కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. అధికారులతో సమీక్ష అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు సీఎం హైదరాబాద్‌కు తిరిగి వెళ్లనున్నారు.
ఇవి కూడా చదవండి : కొండగట్టు వద్ద భారీ ప్రమాదం.. కండక్టర్ మృతి, ఇద్దరి పరిస్థితి విషమం