ఆ 50 నియోజకవర్గాలపై KCR స్పెషల్ ఫోకస్.. ప్రజల మైండ్ డైవర్ట్ కాకుండా కొత్త వ్యూహాం..!

పార్టీ వీక్‌గా ఉన్న సెగ్మెంట్లపై గులాబీ బాస్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. అక్కడ భారీ సభలకు ప్లాన్ చేస్తున్నారు.

Update: 2023-07-04 05:42 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పార్టీ వీక్‌గా ఉన్న సెగ్మెంట్లపై గులాబీ బాస్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. అక్కడ భారీ సభలకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే స్టార్ క్యాంపెయిన్ బాధ్యతలను మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుకు అప్పగించినట్లు ప్రచారం జరుగుతున్నది. అంతేకాకుండా పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆయా సెగ్మెంట్లలో ప్రజల్లో అసంతృప్తిని తగ్గించడంతోపాటు, పార్టీని పటిష్టం చేసుకోవచ్చని భావిస్తున్నారు.

ఆ ఇద్దరికే బాధ్యత..

అధికార పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నదని గుర్తించిన సీఎం కేసీఆర్ నష్టనివారణ చర్యలకు దిగారు. ముఖ్యంగా 50 నియోజకవర్గాల్లో పార్టీ బలహీనంగా ఉన్నట్లు గుర్తించారు. ఆ సెగ్మెంట్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే కేటీఆర్ వరుసగా నియోజకవర్గాలకు వెళ్తున్నారు. పార్టీని ఆశీర్వదించాలని, సిట్టింగ్ ఎమ్మెల్యేలను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పథకాలను సైతం ఆయా సెగ్మెంట్ల నుంచే ప్రారంభించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఆసిఫాబాద్‌లో సీఎం కేసీఆర్ పోడుపట్టాలను పంపిణీ చేయగా, మహబూబాబాద్‌లో మంత్రి కేటీఆర్, కొత్తగూడెం నియోజకవర్గంలో మంత్రి హరీశ్ రావు గిరిజనులకు పాస్ బుక్కులను అందజేశారు. ఈ మధ్యంలో కాలంలో రెండో విడత గొర్రెల పంపిణీ, డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించారు. అదే విధంగా రాబోయే రోజుల్లోనూ గృహ లక్ష్మి, లక్షరూపాయల రుణసాయం, తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాలను సైతం పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లోనే ప్రారంభించే అవకాశాలున్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు.

పథకాలను వివరించేలా..

తొమ్మిదేండ్లలో చేసిన ప్రగతిని ప్రజలకు వివరించాలని ఇప్పటికే అధిష్టానం పార్టీ శ్రేణులను ఆదేశించింది. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతుండడంతో ప్రజల మైండ్ డైవర్ట్ కాకుండా ఉండేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. అందులో భాగంగానే నిత్యం ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రజల్లో ఉండాలని, అభివృద్ధి పేరుతో మంత్రులు పర్యటించాలని కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం.

ముఖ్యంగా మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుకే వీటి బాధ్యతలు అప్పగించినట్లు ప్రచారం జరుగుతున్నది. మిగతా వారితో పార్టీకి ఆ స్థాయి మైలేజ్ రావడం లేదని భావించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అంతేకాకుండా అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో పార్టీ విస్తృత కార్యక్రమాలతోపాటు శ్రేణులను యాక్టీవ్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గట్టెక్కాలని ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

Read More:   ఎన్నికల వేళ T- కాంగ్రెస్ కీలక నిర్ణయం.. BRS, బీజేపీలను ఇరుకున పెట్టేందుకు కొత్త ఎత్తుగడ..! 

సస్పెన్స్ కంటిన్యూ.. T-బీజేపీ చీఫ్ మార్పుపై కొనసాగుతున్న తీవ్ర ఉత్కంఠ..! 


Tags:    

Similar News