5 వేల బడులను మూసేసిన కేసీఆర్ సర్కార్! మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఇదేనంట!

తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ సూళ్ల ఏర్పాటుపై ఆదివారం రేవంత్ సర్కార్ తాజాగా సమీక్ష నిర్వహించింది.

Update: 2024-06-24 06:05 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ సూళ్ల ఏర్పాటుపై ఆదివారం రేవంత్ సర్కార్ తాజాగా సమీక్ష నిర్వహించింది. పైలట్ ప్రాజెక్టు కింద కొడంగల్, మధిర నియోజకవర్గాలను ఎంపిక చేసింది. కాగా, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తాజాగా ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేసింది.

పదేళ్లలో కేసీఆర్ సర్కారు 5000 బడులను మూసివేసిందని ఆరోపించింది. పేదలకు విద్యను దూరం చేసి బర్లు, గొర్లు కాసుకుని బతకమందని గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించింది. రేవంతన్న సర్కారు మూసిన స్కూళ్లను తెరిచి.. ఉచితంగా విద్యుత్ వెలుగులు పంచారని, 65 ఐటీఐలను ఆధునీకరించి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని పేర్కొంది. పేదబిడ్డల విద్యకు రేవంత్ సర్కార్ పెద్దపీట వేస్తోందని, దొరల ప్రభుత్వానికి - ప్రజల ప్రభుత్వానికి తేడా ఇదేనని స్పష్టం చేసింది.

Tags:    

Similar News