మెయిన్ ఎంట్రీ నుంచి కేసీఆర్.. నార్త్ ఈస్ట్ నుంచి ఆఫీసర్స్

కొత్త సచివాలయానికి ప్రారంభోత్సవం సందర్భంగా సుమారు వెయ్యి మంది పోలీసులతో భద్రతా వలయం ఏర్పడింది.

Update: 2023-04-30 08:05 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కొత్త సచివాలయానికి ప్రారంభోత్సవం సందర్భంగా సుమారు వెయ్యి మంది పోలీసులతో భద్రతా వలయం ఏర్పడింది. ఉదయం నుంచే పరిసరాలన్నీ పోలీసుల నియంత్రణలోకి వెళ్ళిపోయాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యాహ్నం 1.20 గంటలకు సచివాలయానికి చేరుకుని తూర్పున ఉన్న ప్రధాన గేటు ద్వారా లోపలికి ప్రవేశించారు. గటు దగ్గరే కారు నుంచి దిగిన కేసీఆర్ పక్కనే ఉన్న యాగశాలకు వెళ్ళి సుదర్శన యాగం, చండీహోమం అనంతరం జరిగిన పూర్ణాహుతిలో పాల్గొన్నారు.

ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి బహుబలి ద్వారం అని పిల్చుకుంటున్న భవనం మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి చేరుకుని కొత్త సెక్రటేరియట్ శిలాఫలకాన్ని ఆవిష్కరించి లాంఛనంగా భవనాన్ని ప్రారంభించారు. అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి చైర్మన్, ప్రధాన కార్యదర్శి, డీజీపీ, మంత్రులు తదితరులంతా ప్రధాన గేటు గుండానే లోపలికి ఎంటర్ అయ్యారు. ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని ఈస్ఠ్ మెయిన్ గేటు దగ్గర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్ తదితరులు స్వాగతం పలికారు. వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆ తర్వాత భవనం మెయిన్ ఎంట్రెన్స్ వరకు రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది.

నార్త్ ఈస్ట్ గేట్ నుంచి అధికారులు

సచివాలయ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా అన్ని శాఖల కార్యదర్శులు, వివిధ విభాగాల హెచ్ఓడీలు, సచివాలయ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులకు ముందుగానే ప్రధాన కార్యదర్శి ఆహ్వానం పంపారు. దీంతో వీరంతా ప్రభుత్వ ఐడీ కార్డులు, పాసులతో నార్త్ ఈస్ట్ గేట్ నుంచి ఎంట్రీ అయ్యారు. మరికొద్దిమంది ఆహ్వానితులకు సౌత్ ఈస్ట్ ఎంట్రీ నుంచి ప్రవేశం లభించింది. వారికి నిర్దేశించిన ప్రాంతంలోనే వాహనాలన్నింటికీ ట్రాఫిక్ పోలీసులు పార్కింగ్ ఫెసిలిటీ కల్పించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి రెండున్నర వేలకు పైగా వాహనాలు కొత్త సచివాలయం ప్రాంగణంలోకి, పరిసర ప్రాంతాల్లోకి చేరుకున్నాయి.

రోడ్లన్నింటినీ బ్లాక్ చేసిన పోలీసులు

సచివాలయం ఓపెనింగ్ ఈవెంట్‌తో పరిసర ప్రాంతాలన్నింటిపై సాదారణ వాహనాల రాకపోకలపై ట్రాఫిక్ పోలీసులు నిషేధం విధించారు. కేవలం వెహికల్ పాస్ ఉన్నవాటికి మాత్రమే అనుమతి లభించింది. చుట్టూ రెండు కి.మీ. పరిధిలో సాధారణ ప్రజల కదలికలపై పోలీసులు ఆంక్షలు విధించారు.

Tags:    

Similar News