రంగంలోకి కేసీఆర్.. యువరక్తంతో నిండనున్న బీఆర్ఎస్
అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఓటమి తర్వాత మాజీ సీఎం కేసీఆర్(ex Cm Kcr) తన ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారు.
దిశ, వెబ్ డెస్క్: అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఓటమి తర్వాత మాజీ సీఎం కేసీఆర్(ex Cm Kcr) తన ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారు. దీంతో ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ ఇచ్చిన హామీల(Guarantees) అమలుకు ప్రభుత్వానికి సమయం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో త్వరలో కేసీఆర్(KCR) ప్రజాక్షేత్రంలోకి వస్తారని ఇటీవల బీఆర్ఎస్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2025 జనవరి(January) నుంచి బీఆర్ఎస్ (brs)అధినేత కేసీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వం(congress govt)పై మాట్లాడటానికి ప్రజల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం కొత్త సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్(Brs) పార్టీ నుంచి గెలిచి.. కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కొత్త ఇంచార్జిల నియమించనున్నట్లు తెలుస్తుంది. జనవరి నుంచి ప్రారంభమయ్యే కొత్త కమిటీల్లో ఈ సారి పూర్తిగా యువ నాయకులకు( young leaders) కీలక పదవులు, భాద్యతలు ఇవ్వనున్నట్లు సమాచారం అందుతుంది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో కులగణన (సమగ్ర కుటుంబ సర్వే) పూర్తయిన వెంటనే సర్వే ఆధారంగా చేసుకొని స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే.