కేసీఆర్ ముఖ్యమంత్రిగా తెలంగాణకు తీరని అన్యాయం చేశారు.. అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ ఫైర్
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణకు తీరని అన్యాయం చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు.
దిశ, వెబ్‌డెస్క్: కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణకు తీరని అన్యాయం చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇవాళ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. కృష్ణా నదిపై ప్రాజెక్టులను ఎవరీ అప్పగించలేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ సమాజానికి సభ సాక్షిగా స్పష్టం చేస్తున్నానని అన్నారు. ఎవరో రాసిచ్చిన మినిట్స్ చూసి మాపై నిందలు వేయడం సరికాదని అన్నారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించడం లేదని మినిట్స్‌లో స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. గతంలో కృష్ణా నీటి పంపకాలపై కేసీఆర్, సీఎం జగన్ ఏకాంతంగా చర్చలు జరిపారంటూ గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రజలు వాస్తవాలు గమనించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.