కవిత జంతర్ మంతర్ ధర్నా సిగ్గుచేటు: కోదండరామ్

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్ అయితే అది తెలంగాణ సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ. కోదండరామ్ విమర్శించారు.

Update: 2023-03-09 07:58 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్ అయితే అది తెలంగాణ సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ. కోదండరామ్ విమర్శించారు. కవిత అంశం తెలంగాణకు ముడిపెట్టడం అధికార మదం, అహంకారానికి నిదర్శనమన్నారు. సారాయి వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రయత్నాలు చేసిన కవిత.. మహిళా బిల్లుపై జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తానని చెప్పడం సిగ్గు చేటని ఎద్దేవా చేశారు. గురువారం నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కోదండరామ్.. కవిత, అదానీ విషయంలో టీజేఎస్ ఓకే విధానంతో ఉన్నామన్నారు.

కవిత తన సొంత వ్యాపారుల కోసం అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేస్తారని ప్రశ్నించారు. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను పార్టీ నుంచి కేసీఆర్ ఎందుకు సస్పెండ్ చేయడం లేదన్నారు. తెలంగాణ ప్రజలు నిరుద్యోగం, అధిక ధరలతో సతమతమవుతున్నారని, మిలియన్ మార్చ్ స్ఫూర్తితో శుక్రవారం తెలంగాణ బచావో సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు. తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు ఈ సదస్సుకు తరలి రావాలని పిలుపు నిచ్చారు. రాష్ట్ర పరిస్థితులపై ఈ సదస్సులో చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామన్నారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..