అండమాన్‌లో కవిత ఫ్లెక్సీ.. ఎందుకంటే?

ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం నేపథ్యంలో ప్రతి ఒక్కరి నోట నానుతున్న పేరు.

Update: 2023-03-13 16:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం నేపథ్యంలో ప్రతి ఒక్కరి నోట నానుతున్న పేరు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా లిక్కర్ స్కాంలో కవిత పేరు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే కవిత అరెస్ట్ అంటూ ప్రచారం జరుగుతున్న సందర్భంగా అండమాన్ నికోబార్ దీవుల్లో కవిత ఫ్లెక్సీ కనిపించడం ఆసక్తిగా మారింది. నేడు కవిత పుట్టిన రోజు సందర్భంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ అభిమాని కవితపై అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు.

అందరిలా కేక్ కట్ చేసో, పండ్లు పంచడం కాకుండా వెరైటీగా విషెస్ చెప్పాలని ప్లాన్ చేశాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన చిన్నుగౌడ్ అండమాన్ దీవులకు వెళ్లాడు. అక్కడ బంగాళఖాతంలో మునిగి సముద్ర గర్భంలో కవితకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఫ్లెక్సీని ప్రదర్శించాడు. నీటి అడుగున డైవింగ్ చేస్తూ కవిత బ్యానర్ తో అటూ ఇటూ తిరుగుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఆ వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. 

Tags:    

Similar News