ఫ్లాష్: విచారణకు కొద్ది నిమిషాల ముందు కేటీఆర్‌తో భేటీ అయిన కవిత

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఈడీ ఎదుట విచారణకు హాజరుకానుంది.

Update: 2023-03-11 05:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఈడీ ఎదుట విచారణకు హాజరుకానున్నారు. ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు కవిత విచారణకు వెళ్లనున్నారు. ఈ క్రమంలో విచారణకు కొద్ది నిమిషాల ముందు కవిత మంత్రులు కేటీఆర్, హరీష్ రావులతో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ ఎదుట విచారణకు హాజరుకానున్నారు. ఇక, కవితకు మద్దతుగా శుక్రవారం రాత్రి మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. విచారణకు సంబంధించిన ప్రశ్నలపై శుక్రవారం రాత్రి నుండి న్యాయ నిపుణులతో చర్చలు జరిపిన కవిత.. విచారణకు వెళ్లే కొద్ది నిమిషాల ముందు సోదరుడు, బావతో భేటీ కావడం హాట్ టాపిక్‌గా మారింది. 

Tags:    

Similar News

టైగర్స్ @ 42..