సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన కర్ణాటక మంత్రి బోసురాజు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ని కర్ణాటక మంత్రి బోసురాజు మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన మంత్రి బోసురాజు..
దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ని కర్ణాటక మంత్రి బోసురాజు మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన మంత్రి బోసురాజు.. రేవంత్ రెడ్డికి పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సత్కరించారు. అనంతరం కాసేపు ముచ్చటించారు. కాగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బోసురాజు మాన్వి నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయినా ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తిస్తూ మంత్రి పదవి వెతుక్కుంటూ వచ్చింది. క్షత్రియ (రాజులు) కులానికి చెందిన బోసు రాజు సిద్దరామయ్య కేబినేట్లో మంత్రి పదవి దక్కించుకున్నారు.