సీఎం కేసీఆర్ పాలన అంతా అవినీతిమయం: మంత్రి మునియప్ప
కర్ణాటకలో ఐదు గ్యారంటీలు అమలు కర్ణాటక కాంగ్రెస్ మంత్రి మునియప్ప స్పష్టంచేశారు. ఇవాళ ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు.
దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటకలో ఐదు గ్యారంటీలు అమలు కర్ణాటక కాంగ్రెస్ మంత్రి మునియప్ప స్పష్టంచేశారు. ఇవాళ ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో తాము చెప్పి హామీలు ఇవ్వడం లేదని కేసీఆర్ అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. దేశంలో మొదటిసారి గృహలక్ష్మి పథకాన్ని కర్ణాటకలో పెట్టామని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ పది ఏళ్లు అధికారంలో ఉండి ప్రజలకు ఏం చేశారని నిలదీశారు. కేసీఆర్ పాలన అంతా అవినీతిమయమని ఆరోపించారు. మోడీకి దళిత వర్గాలని మంచి చేయాలని చూస్తే ముందు ఆర్డినెన్స్ పార్లమెంట్‌కి తీసుకురండి.. కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పేవి చేస్తుందని, కర్ణాటకలో చెప్పింది వంద రోజులోనే అమలు చేశామని మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేస్తుందని, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ని ఆదరించాలన్నారు.