భర్త ఇంటి ఎదుట భార్య బైఠాయింపు
కని పెంచి పెద్ద చేసి అల్లారు ముద్దుగా పెంచుకున్న
దిశ,శంకరపట్నం : కని పెంచి పెద్ద చేసి అల్లారు ముద్దుగా పెంచుకున్న ఓ ఆడపిల్ల ని ఓ యువకుడి కాళ్లు కడిగి కన్యాదానం చేశారు. 2022 ఆగస్టు 20న అంగరంగ వైభవంగా కట్న కానుకలు ఇచ్చి పెళ్లి చేశారు.వివాహం తర్వాత తన కలల ప్రపంచంలోకి ఎన్నో ఆశలతో అడుగు పెట్టింది ఆ అమ్మాయి. కానీ తీరా రెండు సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత అమ్మాయి బాగాలేదు నాకు వద్దంటున్నాడు ఓ ప్రబుద్ధుడు. వివరాల్లోకి వెళితే.... హుజురాబాద్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి తన కూతురును కాచాపూర్ గ్రామానికి చెందిన హరీష్ అనే యువకుని తో 2022 ఆగస్టు 20న వివాహం జరిపించారు .రెండు సంవత్సరాలు హైదరాబాద్ లో కాపురం పెట్టారు.
సజావుగా కొనసాగిన వారి సంసారం ఆ తర్వాత భర్త నుంచి వేధింపులు మొదలయ్యాయని తెలిపింది.నువ్వు బాగా లేవని నాకు అక్కర్లేదని, గత ఆరు నెలల కాలం నుండి పుట్టింటి నుండి తీసుకు వెళ్లడం లేదని రోదిస్తూ తెలిపింది.గతంలో పలుమార్లు గ్రామ పెద్దల మధ్య పంచాయతీ నిర్వహించిన కూడా హరీష్ తీసుకు వెళ్ళకుండా మొండికేయడం తో తన బంధువులు, కొంతమంది మహిళలతో కలిసి భర్త ఇంటి ముందు బైఠాయించింది. దీంతో విషయం తెలుసుకున్న వారి తల్లిదండ్రులు గేటుకు తాళం పెట్టి లోపల సేద తీరుతున్నారు. అమ్మాయి తల్లిదండ్రులను వివరణ అడగగా వారు కోరిన విధంగా అన్ని ఇచ్చామని మా అమ్మాయి భవిష్యత్తును నాశనం చేయవద్దని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.ఆదివారం మరోసారి పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకుంటాం అనడంతో అక్కడ నుండి వెను తిరిగారు.