తప్పుడు వైద్యం చేస్తే కఠిన చర్యలు తప్పవు..
అర్హత లేకుండా స్థాయికి మించిన వైద్యం చేస్తే చట్ట ప్రకారం కఠిన
దిశ, జగిత్యాల కలెక్టరేట్: అర్హత లేకుండా స్థాయికి మించిన వైద్యం చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని జిల్లా డీఎంహెచ్వో ప్రమోద్ కుమార్ హెచ్చరించారు. గురువారం జిల్లాలోని ఆర్ఎంపీ, పీఎంపీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ ఆర్ఎంపీలు, పీఎంపీలు స్వయంగా రోగ నిర్ధారణ పరీక్షలు చేసి మందులు ఇవ్వడం, యాంటీబయాటిక్స్ ఇవ్వడం డిస్క్రిప్షన్ రాయడం వంటివి చేయకూడదని సూచించారు. నిబంధనలను ఉల్లంఘించి ప్రవర్తించిన వారిపై తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ (రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్-2010 ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.
చికిత్స కేంద్రం ముందు సూచిక బోర్డులపై ఫస్ట్ ఎయిడ్ సెంటర్ లేదా ప్రథమ చికిత్స కేంద్రం అని మాత్రమే ప్రదర్శించాలని... క్లినిక్, ఆసుపత్రి, నర్సింగ్ హోం,మెడికల్ సెంటర్ లేదా మరే ఇతర పేర్లతో సూచిక బోర్డులను ప్రదర్శించరాదని అన్నారు. ఎన్సిడి టీవీ కేసెస్ గుర్తించడంలో కూడా సహకారం అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ ఏ శ్రీనివాస్, డాక్టర్ పి అర్చన, డాక్టర్ జైపాల్ రెడ్డి ఇతర సిబ్బందితో పాటు ఆర్ఎంపీలు,పీఎంపీలు పాల్గొన్నారు.