నీటి వృథాను పట్టించుకునేది ఎవరు?

వర్షాకాలం వెళ్లిపోయిన ఆ వాడలో నీరు నిలిచే ఉంటుంది. సీసీ రోడ్డు పైన నీరు చేరి గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు.

Update: 2024-10-06 12:54 GMT

 దిశ, శంకరపట్నం : వర్షాకాలం వెళ్లిపోయిన ఆ వాడలో నీరు నిలిచే ఉంటుంది. సీసీ రోడ్డు పైన నీరు చేరి గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. వివరాల్లోకి వెళితే శంకరపట్నం మండలంలోని కరీంపేట గ్రామంలో పలు వార్డులలో గ్రామ పంచాయితీల నల్లా నీరు లీకేజీ అవుతున్న పట్టించుకునే వారే లేరని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రతిరోజు గ్రామపంచాయతీ ద్వారా వచ్చే నల్లా నీరు ఎనిమిదవ వార్డులో, గ్రామ పాఠశాల రోడ్డులో నీరు వృథాగా పోతున్న సంబంధిత గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని, పలుమార్లు గ్రామస్తులు పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. లీకేజ్ అయిన నీరు తిరిగి మళ్లీ పైప్ లలోకి వెళ్లి అవే నీరును తాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, దీంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. రోడ్లపై నీరు నిలిచి ఉండడంతో దోమలకు ఆవాసంగా మారి వ్యాధులు ప్రబలుతున్నట్లు తెలిపారు. తక్షణం లీక్ అవుతున్న పైపులను,గేట్ వాల్వును మరమ్మత్తు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.


Similar News