కొబ్బరికాయలు కొట్టడం తప్ప బీఆర్ఎస్ చేసిందేమిటి..? : బండి సంజయ్
కరీంనగర్ ను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కేంద్రంతో మాట్లాడి స్మార్ట్ సిటీ
దిశ,కరీంనగర్: కరీంనగర్ ను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కేంద్రంతో మాట్లాడి స్మార్ట్ సిటీ కింద నిధులు తీసుకొస్తే ఎవడబ్బ సొమ్ము అని బీఆర్ఎస్ ప్రభుత్వం దారి మళ్లించిందని ప్రశ్నించారు. కేంద్ర నిధులతో జరిగే అభివృద్ధి పనులకు కరీంనగర్ లో కొబ్బరికాయలు కొట్టడం తప్ప గంగుల కమలాకర్ సాధించిందేమిటని నిలదీశారు. ఎన్నికల్లో భాగంగా సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు కోతిరాంపూర్, మల్కాపూర్ డివిజన్లలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున స్థానికులు హాజరై పూలు చల్లి, తిలకం దిద్ది, హారతులిచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ చేసిన ప్రసంగిస్తూ నేను రెండుసార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయాను. ఎంపీగా గెలిపించారు. మీకోసం కేంద్రం నుండి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చిన. అంతేగాకుండా ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన అని అన్నారు.
కరీంనగర్ ను అభివృద్ధి చేయాలని కేంద్రంతో మాట్లాడి 194 కోట్ల రూపాయల నిధులు నేను తీసుకొస్తే… వాటిని ఖర్చు పెట్టకుండా దారి మళ్లించారు.నిలదీస్తే రూ.30 కోట్లు ఇచ్చినట్లు అధికారులు. మేం నిధులిస్తే ఎవడబ్బ సొమ్ము అనుకొని దారి మళ్లించారో చెప్పాలి.తీగలగుట్టపల్లి ఆర్వోబీ నిర్మాణం, కరీంనగర్ ..వరంగల్, కరీంనగర్, జగిత్యాల రోడ్ల విస్తరణకు నేను నిధులు తీసుకొస్తే బీఆర్ఎస్ నాయకులు కొబ్బరికాయలు కొట్టి తామే నిధులు ఖర్చు చేసినట్లు ఫోజులు కొడుతున్నారు. వీళ్లు కొబ్బరికాయలు కొట్టడానికి తప్ప దేనికి పనికిరారు. కోతిరాంపూర్ ప్రజలు డంపింగ్ యార్డు తో అల్లాడుతున్నారు. మంత్రిగా ఉన్న గంగుల ఎందుకు తరలించలేదు? ప్రజలు చస్తున్నా పట్టించుకోని వ్యక్తికి ఓటెలా వేస్తారు? దయచేసి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చకండి. ప్రతి ఒక్కరూ పువ్వు గుర్తుపై ఓటేసి గెలిపించాలి అని కోరారు.