మహనీయుల విగ్రహాల ఆవిష్కరణకు కృషి చేస్తా
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో నెలకొల్పిన మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించేందుకు సంబంధిత మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు అవసరమైతే అసెంబ్లీలో మాట్లాడతానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.

దిశ, తిమ్మాపూర్ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో నెలకొల్పిన మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించేందుకు సంబంధిత మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు అవసరమైతే అసెంబ్లీలో మాట్లాడతానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రాం విగ్రహాలకు వేసిన ముసుగులను తొలగించి ఆవిష్కరించాలని జేఏసీ ఆధ్వర్యంలో గత 14 రోజులుగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలను సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా విగ్రహాల ఆవిష్కరణకు అడ్డుపడడం ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు తగదని అన్నారు. ఈ విషయాన్ని ఖచ్చితంగా మంత్రి పొన్నంతోనూ, శాసన సభలోనూ మాట్లాడి మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తో మీకు సమాచారం అందిస్తానని హామీ ఇచ్చారు.
ఇక్కడి ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని మహనీయుల జయంతి వేడుకలలోపు విగ్రహాలను ఆవిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జేఏసీ నాయకులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు తప్పక విజయం సాధిస్తాయని, మీ వెంట బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అండగా ఉంటారని అన్నారు. 14 రోజులుగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, వోడితెల సతీష్ బాబు, బాల్క సుమన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, గెల్లి శ్రీనివాస్, రావుల రమేష్ సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు వంతడుపుల సంపత్, మాతంగి శంకర్, దుండ్ర రాజయ్య, మాతంగి లక్ష్మణ్, వడ్లూరి శంకర్, ఎలుక ఆంజనేయులు, కవ్వంపల్లి పద్మ, పాశం అశోక్ రెడ్డి, పొన్నం అనిల్, ఖమ్మం కృష్ణ, కోయడ మురళి, కొమ్మ సంపత్, పబ్బ తిరుపతి, సముద్రాల మల్లేశం, ఎల్కపల్లి పరుశురాములు, అసోద రాములు, సంగుపట్ల మల్లేశం, పార్నంది సంపత్ పాల్గొన్నారు.