అందరి సహకారంతో అభివృద్ధికి కృషి చేస్తా
నియోజకవర్గ ప్రజలందరి సహకారంతో అభివృద్ధికి కృషి చేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు.
దిశ, జగిత్యాల కలెక్టరేట్ : నియోజకవర్గ ప్రజలందరి సహకారంతో అభివృద్ధికి కృషి చేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా నిర్వహించిన అర్బన్ డే వేడుకలలో టీపీసీసీ స్పోక్ పర్సన్ శ్రీనివాస్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ పరిధిలో నిర్మించిన స్టాల్స్ ను ప్రారంభించారు.
మహిళా సంఘాలకు స్ట్రీట్ వెండర్స్ కు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మున్సిపల్ కార్మికులతో కలిసి సహఫంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి పనులను వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, కమిషనర్ చిరంజీవి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.