చినుకు పడితే చిత్తడే..!

ఏళ్ల తరబడి రోడ్డుకు మరమ్మతులు చేయకపోవడం, గత మూడు రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలకు సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి - లస్మన్న పల్లి గ్రామాల ప్రధాన రహదారిలో గుంతలు ఏర్పడి వర్షపు నీరు నిలిచి బురదమయమై అద్వానంగా తయారైంది.

Update: 2024-07-20 10:09 GMT

దిశ, సైదాపూర్ : ఏళ్ల తరబడి రోడ్డుకు మరమ్మతులు చేయకపోవడం, గత మూడు రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలకు సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి - లస్మన్న పల్లి గ్రామాల ప్రధాన రహదారిలో గుంతలు ఏర్పడి వర్షపు నీరు నిలిచి బురదమయమై అద్వానంగా తయారైంది. చిన్నపాటి వర్షానికే గుంతల్లో నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. రాత్రివేళల్లో సరిగా కనిపించక గుంతల్లో పడి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలంటే కనీసం నడిచి వెళ్లే పరిస్థితి కూడా లేదు. రోడ్డు మొత్తం గుంతలమయం కావడంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు నీరు చేరి బురదతో ఎక్కడ గుంతలున్నాయో.. ఎక్కడ రోడ్డు ఉందో తెలీని పరిస్థితి నెలకొంది.

ద్విచక్ర వాహనాలను నడపాలంటే వాహనదారులు చంపుతున్నారు. బురదమయంగా ఉండడంతో వాహనాలు నడిపే క్రమంలో జారిపడే పరిస్థితులు ఉన్నాయి. గతంలో ఉమ్మడి వెన్నంపల్లి నుంచి ఎంపీటీసీ సభ్యునిగా గెలిచి ఎంపీపీ అయినా ప్రభాకర్ రెడ్డి, అలాగే ఉమ్మడి వెల్లంపల్లి గ్రామం నుంచి జెడ్పీటీసీగా గెలిచి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా ఉన్న పేరాల గోపాలరావు ఇద్దరు ప్రజాప్రతినిధులుగా ఉండి వెన్నంపల్లి - లస్మన్నపల్లి గ్రామాలకు చెందిన ప్రజలు వారి పై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News