అనుమతి లేని కట్టడం నేలమట్టం

గౌతమినగర్ లో అనుమతి లేని కట్టడాన్ని రామగుండం నగర సంస్థ అధికారులు కూల్చి వేశారు.

Update: 2024-10-09 12:59 GMT

దిశ, గోదావరిఖని టౌన్ : గౌతమినగర్ లో అనుమతి లేని కట్టడాన్ని రామగుండం నగర సంస్థ అధికారులు కూల్చి వేశారు. పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), కమిషనర్ ఏసీ అరుణ శ్రీ ఆదేశాల మేరకు రామగుండం నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళికా విభాగం సిబ్బంది బుధవారం గౌతమినగర్ లోని ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీలో పర్లపెల్లి సందీప్ అనే వ్యక్తి నిర్మిస్తున్న అనధికార కట్టడాన్ని కూల్చివేశారు.

     నోటీస్ జారీ చేసినప్పటికీ సదరు భవన నిర్మాణ యజమాని స్పందించలేదని పట్టణ ప్రణాళికా విభాగం ఏసీపీ శ్రీధర్ ప్రసాద్, టీపీఎస్ నవీన్ తెలిపారు. నగర పాలక సంస్థ అనుమతి పొందిన తరువాతనే భవన నిర్మాణాలు చేపట్టాలని వారు సూచించారు. ఇకముందు ఎవరు నిర్మించినా కూల్చివేసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. 

Tags:    

Similar News