గుట్టను తవ్వుతున్న గుట్టు రట్టు చేసిన తహశీల్దార్..

ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామ శివారులో గల హోమ జయ ఆశ్రమం వద్ద గల గుట్టలను ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వేస్తున్నారు.

Update: 2024-11-10 06:10 GMT

దిశ, ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామ శివారులో గల హోమ జయ ఆశ్రమం వద్ద గల గుట్టలను ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వేస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో అధికారులు ఎవరూ రారనుకుని వేకువ జామున నుండి జెసిబి సహాయంతో తవ్వుతూ టిప్పర్ లలో మట్టిని తవ్వి వేరే చోట అమ్ముకుంటున్నారు.

ఈ విషయం గురించి మండల తహశీల్దార్ బోయిని రామచందర్ కు సమాచారం అందగా క్షేత్ర స్థాయిలో వెళ్లి ఒక జేసీబీ యంత్రంతో సహా రెండు టిప్పర్లు స్వాధీనం చేసుకుని మండల తహశీల్దార్ కార్యాలయంకు తరలించినట్లు ఆయన తెలిపారు. మట్టి, ఇసుక తీయాలంటే మైనింగ్, రెవెన్యూ శాఖ అనుమతులు తప్పకుండా పొందాలని లేదంటే రెవెన్యూ చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని మండల తహశీల్దార్ హెచ్చరించారు.


Similar News