సోషల్ మీడియాలో ఇతరుల మనోభావాలను రెచ్చేగొట్టే విధంగా పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్..

ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ నాగేంద్ర చారి అన్నారు.

Update: 2023-06-01 10:24 GMT

దిశ, చందుర్తి : ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ నాగేంద్ర చారి అన్నారు. తంగళ్లపెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా విధంగా పోస్ట్ పెట్టిన వ్యక్తిని కేసునమోదు చేసి అరెస్ట్ చేశారు. తంగలపల్లి మండలం సమాచారం అనే వాట్సప్ గ్రూప్ లో తన మొబైల్ నుండి ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా పోస్టులు పెట్టిన తంగళ్లపెల్లి మండలం చిన్నలింగపూర్ గ్రామానికి చెందిన జోగినిపెళ్లి రాజగోపాల్ అనే వ్యక్తి పై కేసునమోదు చేసి తన మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

ఇతరుల మనోభావాలను రెచ్చగొట్టే విధంగా సామాజిక మాధ్యమాల్లో ఎలాంటి పోస్టులు చేసిన వారి పై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని, ప్రజలు ఎవరు కూడా సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులు నమ్మకూడదని, సామాజిక మాధ్యమాల్లో వచ్చే మెసేజ్ లలో నిజానిజాలు తెలుసుకోకుండ ఇతర గ్రూప్ లలో ఫార్వర్డ్ చేసిన వ్యక్తి పై గ్రూప్ అడ్మిన్ పై చట్ట ప్రకారం చర్యలు తప్పవని డీస్పీ నాగేంద్రచారి హెచ్చరించారు.

Tags:    

Similar News