గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయం
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని నాచుపెల్లి గ్రామంలో రూ.47 లక్షలతో నిర్మించ తలపెట్టిన కల్వర్టు కొండాపూర్ గ్రామంలో ఇరువై లక్షల రూపాయల సీసీ రోడ్ల నిర్మాణానికి బుధవారం స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శంకుస్థాపన చేశారు.
దిశ, కొడిమ్యాల : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని నాచుపెల్లి గ్రామంలో రూ.47 లక్షలతో నిర్మించ తలపెట్టిన కల్వర్టు కొండాపూర్ గ్రామంలో ఇరువై లక్షల రూపాయల సీసీ రోడ్ల నిర్మాణానికి బుధవారం స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ రాజ నర్సింగారావు, ఎంపీడీఓ స్వరూప, పీఆర్ ఏఈ చంద్ర శేఖర్, నాయకులు నారాయణ, ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, అజయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.