ప్రమాదాలు జరుగుతున్న కల్వర్టు నిర్మించరా..?

పలుసార్లు ప్రమాదాలు జరిగినప్పటికీ రోడ్డు, రవాణా శాఖ అధికారులు

Update: 2024-10-31 03:50 GMT

దిశ, చిగురుమామిడి : పలుసార్లు ప్రమాదాలు జరిగినప్పటికీ రోడ్డు, రవాణా శాఖ అధికారులు కల్వర్టు నిర్మించకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూర్ కోళ్ల ఫారం దగ్గర కల్వర్టు లేక రాత్రి సమయాల్లో పలుమార్లు ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోతున్నారు. ఆర్ అండ్ బి అధికారులు చొరవ తీసుకొని కల్వర్టు నిర్మిస్తే ప్రమాదాల నుంచి ప్రజలు తప్పించుకోవచ్చని ప్రయాణికులు కోరుతున్నారు. మండల అధికారులు గానీ,ప్రజా ప్రతినిధులు గాని చొరవ తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. గతంలో ఇక్కడ రోడ్డు పక్కన బావిలో కారు పడటం కూడా ఈ ప్రాంత అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలిసిన విషయమే. కాగా అక్కడ వెంటనే కల్వర్టు నిర్మించాలని ప్రయాణికులు, మండల ప్రజలు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News