చేతికి అందిన పంట వర్షార్పణం...

గురువారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి చేతికందిన పంట వర్షార్పణం అయింది.

Update: 2024-10-17 09:07 GMT

దిశ, గన్నేరువరం : గురువారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి చేతికందిన పంట వర్షార్పణం అయింది. గన్నేరువరం మండల కేంద్రంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో అమ్మకానికి రైతులు పోసిన ధాన్యం కుప్పలు భారీ వర్షానికి కొట్టుకొని పోయాయి. ఐకేపీ కొనుగోలు కేంద్రం ప్రారంభం కాకపోవడం, సెంటర్ నిర్వాహకులు ధాన్యం తడవకుండా ఉండేందుకు టార్పాలిన్లు ఇవ్వకపోవడంతో ధాన్యం వర్షంలో తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.


Similar News