కారు బోల్తా.. తండ్రి కొడుకులకు తప్పిన ప్రమాదం..
ఎల్లారెడ్డి పేట మండలం రాచర్ల గొల్లపల్లి - రాజన్నపేట రెండు గ్రామాల మధ్య గల పంట పొలాల వద్ద కారు బోల్తాపడింది.
దిశ, ఎల్లారెడ్డి పేట : ఎల్లారెడ్డి పేట మండలం రాచర్ల గొల్లపల్లి - రాజన్నపేట రెండు గ్రామాల మధ్య గల పంట పొలాల వద్ద కారు బోల్తాపడింది. రాజన్నపేటకు చెందిన కాంగ్రెస్ నాయకులు ఉడుగుల సురేందర్ తన కుమారుడుకి కారు నడపడం నేర్పిస్తుండగా వేగంగా కారు వెళ్లడంతో ప్రమాదం జరిగినట్లు తెలిసింది. అటు వైపుగా వెళ్తున్న పలువురు యువకులు బోల్తా పడిన కారును గుర్తించి కారులో ఉన్న సురేందర్ ను అతడి కుమారుడిని బయటకు తీశారు. కారు యజమాని సురేందర్ కు అతడి కుమారుడికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. తృటిలో ప్రాణాపాయం నుండి బయటపడడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. కారును వేగంగా నడుపుతుండగా రాచర్ల గొల్లపల్లి కి చెందిన వెంకటేశ్ అనే రైతు పత్తి పంట కు మందు స్ప్రే చేయడానికి నీళ్ళు మోస్తుండగా అతడిని డీ కొట్టగా స్వల్ప గాయాలతో బయటపడ్డాడని సమాచారం.