విద్యార్థినిపై పైశాచికత్వం.. అధ్యాపకురాలిపై ప్రభుత్వం సస్పెన్షన్

దిశ, రాజన్నసిరిసిల్ల: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ సాంఘీక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ఘటన

Update: 2022-08-29 05:25 GMT

దిశ, రాజన్నసిరిసిల్ల: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ సాంఘీక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ఘటనపై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సీరియస్ అయ్యారు. విద్యార్థిని నిహారికను ఐదు రోజుల పాటు నిల్చోబెట్టి ఆమె ప్రాణాలతో చెలగాటం ఆడిన ఆధ్యాపకురాలు మహేశ్వరిని సస్సెండ్ చేశారు. వేములవాడ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్ చివరి సంవత్సరం విద్యార్థిని నీహారిక ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఘటన జరిగినప్పుడు వేములవాడ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గా ఉన్న మాతంగి కల్యాణి పర్యవేక్షణ లోపంపై చర్యల తీసుకోవాల్సిందిగా సంబంధిత ఉన్నతాధికారులకు జిల్లా కలెక్టర్ సిఫార్సు చేశారు.

Also Read : విద్యార్థి చేయి విరిగేలా కొట్టిన టీచర్.. ఎందుకంటే?


Similar News