పోగొట్టుకున్న బంగారు ఆభరణాలు అప్పగింత
ఆటోలో ప్రయాణించి ఓ మహిళ తన హ్యాండ్ బ్యాగ్ పోగొట్టుకొని అందులో 10 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయని బుధవారం రాత్రి కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
దిశ, కొత్తపల్లి : ఆటోలో ప్రయాణించి ఓ మహిళ తన హ్యాండ్ బ్యాగ్ పోగొట్టుకొని అందులో 10 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయని బుధవారం రాత్రి కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన వన్ టౌన్ సీఐ బిల్లా కోటేశ్వర్ రెండు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాలు, ఇతర సాంకేతికత ఆధారంగా ఆటోను గుర్తించిన పోలీసులు సంబంధిత ఆటో డ్రైవర్ నుండి బ్యాగును, అందులోని 10 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
కొన్ని గంటల వ్యవధిలోనే ఆ ఆటోను గుర్తించి ఆభరణాలు బాధితురాలికి గురువారం అప్పగించినట్లు కరీంనగర్ వన్ టౌన్ సీఐ బిల్లా కోటేశ్వర్ తెలిపారు. బంగారు ఆభరణాలు గుర్తించి పట్టుకునేందుకు కృషి చేసిన కరీంనగర్ వన్ టౌన్ సీఐ బిల్లా కోటేశ్వర్, సిబ్బంది, క్రైమ్ కానిస్టేబుళ్లు కుమార్, సంపత్ లను కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి అభినందించారు. వారికి రివార్డులు అందజేశారు.