నివాసాల మధ్య వర్మి కంపోస్ట్ కంపెనీలు.. ఇబ్బందులు పడుతున్న ప్రజలు..
నివాసాల మధ్య ఉన్న వర్మి కంపోస్టు కంపెనీలతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
దిశ, అబ్దుల్లాపూర్మెట్ : నివాసాల మధ్య ఉన్న వర్మి కంపోస్టు కంపెనీలతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం మురుగు వాసనతో చుట్టుపక్కల నివసించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద అంబర్పేట నుంచి పసుమాములు వెళ్లే దారితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో వర్మి కంపోస్టు కంపెనీలు ఉన్నాయి. వర్మి కంపోస్ట్ తయారీ నిమిత్తం తీసుకువచ్చే పేడ ఇతర వాటితో చుట్టూ వాసన వెదజల్లుతోందని స్థానికులు వివరిస్తున్నారు. వర్మి కంపోస్టులు మొత్తం చుట్టుపక్కల చెట్ల మధ్య నివాసాల మధ్య ఉండడంతో పాములు పేడనుండి వస్తూ ఇళ్లలోకి వస్తున్నాయని వివరిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు అధికారులకు తెలిపిన పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ఈ మురుగుతో దోమలు విపరీతంగా ఇళ్లలోకి వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దోమల బారిన రోగాలపాలయ్యామని వివరిస్తున్నారు. పసుమాముల వెళ్లే దారిలో కొంతమంది స్థలాలను అద్దెకి తీసుకొని వర్మీ కంపోస్ట్ ను తయారు చేస్తున్నారని అంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి పేడను లారీలలో, ట్రాక్టర్లలో తీసుకువస్తూ డంపు చేస్తున్నారని వాపోతున్నారు.
డంప్ చేసే క్రమంలో రోడ్ల పై పెద్ద ఎత్తున పడిపోయి రోడ్లన్నీ పాడై ఒక్కోసారి ద్విచక్ర వాహనాలు అదుపుతప్పి వాహన దారులు కింద పడుతున్నారని వివరిస్తున్నారు. సంబంధిత భూ యజమానులు గతంలో ఇల్లు లేకపోవడం వల్ల అద్దెలకు ఇచ్చిన కూడా ప్రస్తుతం చుట్టూ నివాసాలు ఏర్పడ్డాయని గుర్తించాలని కోరుతున్నారు. ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు.. పొగాకు నరసింహ స్థానికులు నివాసాల మధ్య వర్మి కంపోస్ట్ ఉండడం కారణంగా దోమలు విపరీతంగా ఇళ్లలోకి వస్తున్నాయని చెబుతున్నారు. దీంతో రోగాల బారిన పడుతున్నామని వాపోతున్నారు. పేడను రోడ్ల పై తరలించే క్రమంలో రోడ్డంతా పేడతో దుర్గందంగా మారుతున్నాయన్నాయి. పలువురు రోడ్ల పై పడి గాయల పాలైన ఘటనలు కూడా ఉన్నాయని తెలిపారు. వర్మీ కంపోస్ట్ తయారీకి స్థాలాలను అద్దెకిచ్చే యజమానులు కూడా కొంత ఆలోచించాలని కోరుతున్నామాన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నామన్నారు.