గిఫ్టులు పంచిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సస్పెన్షన్
ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బైబిల్, గిఫ్ట్ ఐటమ్స్ ను పంపిణీ చేసిన ఉపాధ్యాయుడు సస్పెండ్ అయ్యాడు.
దిశ, ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బైబిల్, గిఫ్ట్ ఐటమ్స్ ను పంపిణీ చేసిన ఉపాధ్యా యుడు సస్పెండ్ అయ్యాడు. బైబిల్ పంచిన విషయాన్ని బీజేపీ లీడర్లు ఎంఈఓ కృష్ణ హరి తో పాటు ఎస్సై రమాకాంత్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దాంతో వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి ప్రభుత్వ ఉపాద్యాయుడు రాజును జిల్లా విద్యాధికారి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు.