స్టూడెంట్లకు నాణ్యమైన విద్య అందించాలిః అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్

Update: 2024-08-28 11:24 GMT

దిశ, వీర్నపల్లిః రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాన్ని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని రికార్డులు, విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు పట్టికను పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటించారు. పాఠశాలల్లోని పిల్లలకు మౌలిక వసతులు, భోజన సౌకర్యాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని పిల్లలతో స్వయంగా మాట్లాడి తెలుసుకున్నారు. విద్యార్థులకు పలు సబ్జెక్టులకు సంబంధించి ప్రశ్నలను అడిగి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు భోజనం మెనూ ప్రకారంగా పౌష్టిక ఆహారం అందించాలని అన్నారు. భోజన తయారు గదిని కూరగాయలు, బియ్యం, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, పరిసర ప్రాంతాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. పాఠశాల ఆవరణంలో పూల పండ్ల మొక్కలు నాటాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈవో రమేశ్ కుమార్, జీసీడీవో పద్మజ, డీటీ మారుతి రెడ్డి, ఆర్ ఐ ప్రవీణ్ ఉన్నారు.


Similar News