Rajanna Sircilla Collector : విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలి

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ విద్యాలయంలో విద్యార్థులకు అన్ని

Update: 2024-09-10 12:17 GMT

దిశ,కోనరావుపేట : ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ విద్యాలయంలో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండల కేంద్రంలోని మరిమడ్ల గ్రామంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు.విద్యాలయం , రెసిడెన్స్ ఆవరణ చుట్టూ, తరగతి గదులు, కిచెన్ తదితర వాటిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.అనంతరం బాలుర, బాలికల డార్మిటరీ , తరగతి గదుల్లో ఏమైనా ఇబ్బందులు, సమస్యలు ఉన్నాయా అని విద్యార్థులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.ఉపాధ్యాయులు విద్యార్థులకు భోజన సదుపాయం, తరగతులు ఎలా బోధిస్తున్నారు అనే వివరాల పై ఆరా తీశారు.

విద్యార్థులకు సరిపడ టాయిలెట్లు లేనందున, రెండు టాయిలెట్లకు నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని ఎంపీడీఓను ఆదేశించారు. గ్రామం నుండి విద్యాలయం వరకు రోడ్ సరిగ్గా లేదని రోడ్డు నిర్మించడానికి ప్రతిపాదనలు వెంటనే పంపాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు తరగతులు బోధిస్తున్న తీరును పరిశీలించారు. అన్ని సబ్జెక్టులలో విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించేలా పాఠాలు బోధించాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు.ఆయనతో పాటు జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం పాల్గొన్నారు.


Similar News