ఆదాయ సృష్టిపై ప్రత్యేక దృష్టి సారించాలి : పెద్దపల్లి కలెక్టర్

జిల్లాలోని మహిళా సంఘాలు ఆదాయం సృష్టించే కార్యక్రమాల పై ప్రత్యేక

Update: 2024-10-05 12:38 GMT

దిశ,పెద్దపల్లి : జిల్లాలోని మహిళా సంఘాలు ఆదాయం సృష్టించే కార్యక్రమాల పై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. పెద్దపల్లి ఎంపీడీవో ప్రాంగణంలోని జిల్లా మహిళా సమాఖ్య నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. మహిళా సంఘాలకు అందిస్తున్న స్వశక్తి రుణాలు, రుణాల రికవరీ, ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం అమలు, మహిళా సంఘాలకు ఉన్న సమస్యలు మొదలగు అంశాలను కలెక్టర్ ఆరా తీశారు.

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, జిల్లాలోని మహిళా సంఘాలు వారికి అందించిన స్వశక్తి బ్యాంకు లింకేజీ రుణాలు, స్త్రీ నిధి రుణాలు సకాలంలో చెల్లింపులు చేయాలని, ఎన్.పి.ఏ తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. మహిళా సంఘాలు తమకు అందుతున్న బ్యాంకు లింకేజీ రుణాలను వినియోగించుకుంటూ ఆదాయం సృష్టించే కార్యక్రమాలు అమలు పై శ్రద్ధ వహించాలని కలెక్టర్ తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, పెట్రోల్ బంక్, కళ్యాణ మండపం నిర్వహణ మొదలగు వివిధ ఆదాయం సృష్టించే కార్యక్రమాలను మహిళా సంఘాలు చేపట్టడం పై కలెక్టర్ చర్చించి పలు సూచనలు జారీ చేశారు.


Similar News