20 గ్రాముల బంగారం, 20 గ్రాముల వెండితో నేసిన పట్టు చీర.. మరోసారి ప్రతిభ చాటుకున్న కళా రత్న

చేనేత కళా రత్న ప్రతిభకు పదును పెట్టే మరో అద్భుతాన్ని సృష్టించాడు.

Update: 2023-08-05 08:12 GMT

దిశ, సిరిసిల్ల : చేనేత కళా రత్న ప్రతిభకు పదును పెట్టే మరో అద్భుతాన్ని సృష్టించాడు. సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు, చేనేత కళా రత్న అవార్డు గ్రహీత నల్లా విజయ్ మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు. తన ప్రతిభకు పదును పెట్టి 20 గ్రాముల బంగారం జరి, 20 గ్రాముల వెండి జరిని పూర్తిగా ఉపయోగించి పట్టు దారాలతో చీరను తయారు చేశాడు. ఈ చీరను హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త కూతురు వివాహం కోసం తయారు చేసినట్లు విజయ్ తెలిపాడు.

ఈ చీర వెడల్పు 48 ఇంచులు, పొడవు ఐదున్నర మీటర్లు, బరువు 500 గ్రాములు. చీర తయారికి 1,80,000 రూపాయలు ఖర్చు అయిందని, తయారు చేయడానికి నెల రోజుల సమయం పట్టిందని తెలిపాడు. త్వరలో దాదాపు 25 లక్షల రూపాయలు వేచించి మరో చీర రూపొందిస్తానని, ఆ చీరలో అరకిలో వెండి జరి, పావు కిలో బంగారు జరి ఉపయోగించి చీర రూపొందిస్తున్నానని, దానిని మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించబోతున్నట్లు విజయ్ తెలిపాడు.


Similar News