ఖబర్దార్ ఎమ్మెల్యే రసమయి.. అభివృద్ధిపై ప్రశ్నిస్తే చంపుతాను అంటావా..
ఖబర్దార్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు జోలికొస్తే ఊరుకోమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానకొండూరు నియోజకవర్గం పార్టీ ఇంచార్జి
దిశ, శంకరపట్నం : ఖబర్దార్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు జోలికొస్తే ఊరుకోమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానకొండూరు నియోజకవర్గం పార్టీ ఇంచార్జి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హెచ్చరించారు. గురువారం శంకరపట్నం మండల కేంద్రంలో ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు గోపుగోని బసవేగ అధ్యక్షతన మీడియా సమావేశాన్ని నిర్వహించి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నియంతగా వ్యవహరిస్తున్నాడని ఈనెల 6న కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని గద్దపాక గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆ గ్రామ పర్యటనకు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అభివృద్ధి పై ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త అయిన కనుకుంట్ల సాగర్ ను ఓ ఇంటిలోకి తీసుకుపోయి చంపేస్తానని బెదిరించాడని ఆవేదన వ్యక్తం చేశారు.
కవ్వం
నాడు మానకొండూర్ ఎమ్మెల్యే కుట్రపూరితంగా వ్యవహరించడంతో మహంకాళి శ్రీనివాస్ అనే దళిత బిడ్డ అమరుడయ్యాడని, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రశ్నిస్తే వారిని బెదిరింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బెదిరింపులు మానుకోవాలని హితవు పలికారు. పొద్దుపొడుపు కార్యక్రమం పేరుతో పోస్టుమాన్‌ను, అటెండర్ ఉద్యోగం చేస్తూ ఎమ్మెల్యేగా ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలం అయ్యాడని ఎద్దేవా చేశారు. స్థానికేతరుడైన రసమయి బాలకిషన్ ను, రానున్న ఎన్నికల్లో నియోజకవర్గాలు తగిన బుద్ధి పాఠం చెప్పేందుకే నేటి నుంచే అన్ని మండలాల్లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రజలు చైతన్యవంతులై అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు.
మానకొండూరు నియోజకవర్గంలో అభివృద్ధి జరగనందుకే ప్రజలు అడ్డుకుంటున్నారని చెప్పారు. ప్రజలు ప్రశ్నిస్తే పోలీసులచే ఎమ్మెల్యే బెదిరింపులకు గురిచేయడం మానుకోవాలని అన్నారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు పార్టీ అండగా ఉందని నాయకులకు ,కార్యకర్తలకు, ప్రజలకు ఎలాంటి హాని తలపెట్టిన చూస్తూ ఊరుకోమని సాగర్‌కు ఎలాంటి హాని జరిగినా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్ఎల్ గౌడ్, మండల అధ్యక్షుడు బసవయ్య గౌడ్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు జహంగీర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బొజ్జ చంద్రమౌళి, పార్టీ ప్రధాన కార్యదర్శి నాంపల్లి తిరుపతి, మహిళా అధ్యక్షురాలు చింతరెడ్డి పద్మ, గద్దపాక ఉప సర్పంచ్ రాజు, గద్దపాక సింగిల్ విండో డైరెక్టర్ కలకల శంకర్ రెడ్డి, నాయకులు మాజీ ఎంపీటీసీ ఉప్పుగల్లు మల్లారెడ్డి, ఇస్సామోద్దీన్, ప్రవీణ్, భూమయ్య, వెంకటేశం, సంతోష్ కుమార్, ప్రవీణ్, తోపాటు వివిధ గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read more: