రోడ్డెక్కిన మధ్యాహ్న భోజన నిర్వాహకులు

ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు కడుపు నిండా తిండి పెట్టాలని ఆలోచనతో ప్రవేశ పెట్టిన మధ్యాహ్న భోజన పథకంలో అన్ని లోటుపాట్లే కినిపిస్తున్నాయి.

Update: 2023-07-10 12:18 GMT

తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్

దిశ, మల్లాపూర్ : ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు కడుపు నిండా తిండి పెట్టాలని ఆలోచనతో ప్రవేశ పెట్టిన మధ్యాహ్న భోజన పథకంలో అన్ని లోటుపాట్లే కినిపిస్తున్నాయి. సరైన సమయంలో బిల్లులు చెల్లించక నిర్వాహకులు అప్పుల పాలవుతున్నారు. సోమవారం ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని నిలిచి వేశారు. కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మండల కేంద్రంలో భరతమాత కూడలి వద్ద ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫిబ్రవరి నెల నుంచి ప్రభుత్వం జీతాలు చెల్లించడం లేదంటూ, మధ్యాహ్న భోజన పథకం బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఓ వైపు ఆకాశాన్నంటుతున్న నిత్యవసర కూరగాయలు, మరోవైపు బిల్లులు రాక అప్పు చేసి మరి మధ్యాహ్న భోజన పథకాన్ని కార్మికులు నిర్వహిస్తున్నారని తెలిపారు.

గత సంవత్సరం ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథక కార్మికుల వేతనం రూ.2వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. జీతాలుతో పాటు బిల్లులు కూడా చెల్లించడం లేదంటూ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బిల్లులు చెల్లించి విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుచున్నారు.


Similar News