ఆగయ్యను సిరిసిల్లలో తిరగనివ్వంః కాంగ్రెస్ నేతలు

Update: 2024-08-08 10:19 GMT

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య తీట మాటలు మానకోకపోతే తాట తీస్తామని కాంగ్రెస్ సిరిసిల్ల పట్టణ ఉపాధ్యక్షుడు అన్నల్దాస్ భాను హెచ్చరించారు. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డిపై తోట ఆగయ్య చేసిన వాఖ్యలను ఖండిస్తూ గురువారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో స్థానిక నాయకులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. భాను మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందించే పాలన ఓర్చుకోలేక కేటీఆర్ తన అనుచరులు అక్కసుతో అనుచిత వాఖ్యలు చేస్తున్నారన్నారు. కేకే గురించి మాట్లాడే స్థాయి ఆగయ్యకు లేదని, జిల్లాను సాధించేందుకు కమిటీని ఏర్పాటు చేసి, సిరిసిల్ల జిల్లా ఏర్పడడంలో కీలక పాత్ర పోషించాడన్నారు. కేకే ఆయన మాట్లాడిన ఫోన్ సంభాషణను వక్రీకరించి, బీఆర్ఎస్ నేతలు కుల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సిరిసిల్లలో పద్మశాలీలు ఎక్కువగా ఉన్నారని, వారి ఓట్ల కోసం కుల రాజకీయాలు చేస్తున్నారన్నారు. మహేందర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు మానుకోకపోతే సిరిసిల్లలో తిరగనీయబోమని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు వంగ మల్లేశం గౌడ్, నాయకులు గంభీరావుపేట ప్రశాంత్ గౌడ్, గడ్డం కిరణ్, రెడ్డి మల్ల భాను, అల్లం సాయి, మొగిలి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News