ఉపాధి కూలీలకు తపాల శాఖ శుభవార్త..

వేతనాలు తీసుకునేందుకు నానా ఇబ్బందులు పడే ఉపాధిహామీ కూలీలకు తెలంగాణ తపాలశాఖ శుభవార్త తెలియజేసింది.

Update: 2023-05-25 15:21 GMT

దిశ, కరీంనగర్ టౌన్ : వేతనాలు తీసుకునేందుకు నానా ఇబ్బందులు పడే ఉపాధిహామీ కూలీలకు తెలంగాణ తపాలశాఖ శుభవార్త తెలియజేసింది. గ్రామాల్లో బ్యాంకు సదుపాయాలు లేకపోవటంతో ఖాతాలోకి డబ్బులు తీసుకునేందుకు మండల కేంద్రాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఉపాధిహామీ కూలీలకు ఇంటివద్దనే డబ్బులు చెల్లించేందుకు తపాలశాఖ నడుంబిగించింది. ఇంటివద్ద, పనిచేసే చోటనే వేతనాలు తీసుకునేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు కరీంనగర్ డివిజన్ ఇంఛార్జి పోస్టల్ సూపరింటెండెంట్ పి.ప్రభాకర్ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో వ్యవసాయ కార్యకలాపాలు బాగా తగ్గిపోయి ఉపాధిహామీ పనులకు ప్రాధాన్యత పెరిగిందని, అయితే ఉపాధి హామీ కూలీలు చేసిన పనివేతనాలు తీసుకునేందుకు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వారికోసం చక్కటి అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు.

ఇందుకోసం తపాలశాఖ తెలంగాణ రాష్ట్రరూరల్ డెవలప్మెంట్ కమీషనర్ ను సంప్రదించామని, ఈ సౌకర్యం సద్వినియోగం చేసుకునేందుకు సంబంధిత అధికారులకు తగుఆదేశాలు జారీచేస్తామని ఆయన హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కరీంనగర్ డివిజన్లో ఉన్న అన్ని పోస్టాఫీసులలో ఉపాధి హామీ కూలీలకు ఉపయోగపడే సేవింగ్, ఐపీపీబీ ఖాతాలు తెరుచుటకు తగిన ఏర్పాట్లు చేశారని, ఈ పోస్టల్ ఖాతాలు తీసుకుంటే ఇంటి వద్ద, పనిచేసే చోటనే వేతనాలు తీసుకోవచ్చునని, ఈ సౌకర్యాన్ని, అవకాశాన్ని ఉపాధి కూలీలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభాకర్ ప్రకటనలో కోరారు.

Tags:    

Similar News