మల్యాల యువకుడి హత్య కేసును ఛేదించిన పోలీసులు : నిందితుల అరెస్టు

మండల పరిధిలోని రాజారం గ్రామానికి చెందిన యువకుడి హత్య కేసులో మల్యాల పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

Update: 2023-04-19 14:51 GMT

దిశ, మల్యాల: మండల పరిధిలోని రాజారం గ్రామానికి చెందిన యువకుడి హత్య కేసులో మల్యాల పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. గ్రామంలో ఈనెల 9న రాత్రి అదే గ్రామానికి చెందిన గుర్రం వెంకట ప్రవీణ్ (26)ను హతమార్చిన ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు జగిత్యాల డీఎస్పీ ప్రకాష్ తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం మల్యాల పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హత్యకు సంబంధించి వివరాలను వెల్లడించారు.

గ్రామానికి చెందిన శివరాత్రి నరేష్ ( 35) అతని సోదరుడు శివరాత్రి భాగ్యరాజ్ (28)లు మృతుడు వెంకట ప్రవీణ్ తో భూమి తగాదాలు ఉన్నాయని డీఎస్పీ తెలిపారు. ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం జరిగిన ఓ ఫంక్షన్ లో జరిగిన గొడవను దృష్టిలో పెట్టుకొని వెంకట ప్రవీణ్ పై నరేష్, భాగ్యరాజ్ కక్ష పెంచుకుని అతడిని హతమార్చాలని నిర్ణయించుకున్నారు. ఈనెల 9న గ్రామంలో నిర్వహించిన బలగం సినిమాను ప్రదర్శించారు. అదే సమయంలో పథకం ప్రకారం గ్రామంలో అందరూ తాగే స్థలానికి వచ్చి బండి ఎందుకు ర్యాష్ గా నడిపావంటూ ముందుగా నరేష్, భాగ్యరాజ్ లు వెంకట ప్రవీణ్ తో గొడవకు దిగారు.

దీంతో అన్నదమ్ములు ఇద్దరూ వెంకట ప్రవీణ్ పై కర్రలు, బీరు బాటిళ్లతో దాడి చేశారని, అనంతరం అక్కడే ఉన్న బండరాయితో తలపై మోదడంతో ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు డీఎస్పీ ప్రకాష్ వెల్లడించారు. ఈ ఘటనలో గుర్రం వెంకటేష్ అనే వ్యక్తి కూడా తలకు గాయమై కింద పడిపోయాడని డీఎస్పీ తెలిపారు. ఈ దారుణానికి పాల్పడిన శివరాత్రి నరేష్ పై ఇప్పటికే 12 కేసులు వివిధ పోలీస్ స్టేషన్లో నమోదయ్యాయని తెలిపారు. తనపై రౌడీ షీట్ కూడా ఓపెన్ అయిందన్నారు. బుధవారం వారిని వారి ఇంటి వద్దే అరెస్టు చేశామని తెలపారు.

అదేవిధంగా ఓ వెర్నా కారు, మోటార్ సైకిల్, హత్యకు ఉపయోగించిన కర్ర, బీర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్యాల సీఐ రమణమూర్తి, మల్యాల ఎస్ఐ చిరంజీవి, ఏఎస్ఐ కృష్ణకుమార్, హెడ్ కానిస్టేబుల్ భాష, మల్లారెడ్డి భాస్కర్, ప్రవీణ్, రవి, కానిస్టేబుల్ మహేష్, తిరుపతి, సంపత్, తిరుపతి గౌడ్, వేణు, సౌజన్య, తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News