జాతరలో అపశృతి...ఐదుగురిపై పిచ్చి కుక్క దాడి
ఎల్లారెడ్డి పేటలో శుక్రవారం రాత్రి జరిగిన రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి రథోత్సవానికి వెళ్తున్న భక్తులపై పిచ్చి కుక్క దాడి చేసింది.
దిశ, ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డి పేటలో శుక్రవారం రాత్రి జరిగిన రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి రథోత్సవానికి వెళ్తున్న భక్తులపై పిచ్చి కుక్క దాడి చేసింది. దాంతో ఆరుగురికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో ఎల్లారెడ్డి పేటకు చెందిన గన్న మణెమ్మ, బండలింగంపల్లికి చెందిన మంగవ్వ, పదిరకు చెందిన బూదవ్వ, గొల్లపల్లికి చెందిన ముద్రకొల తేజ, నారాయణ పూర్ కు చెందిన ఐజాక్ ను పిచ్చి కుక్క కాటు వేయడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని ఎల్లారెడ్డి పేటలో గల సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు.