సదర్ ఉత్సవాలతో దద్దరిల్లిన పెద్దపల్లి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా సదర్ పండుగను నిర్వహిస్తుంది.

Update: 2024-11-10 16:24 GMT

దిశ, పెద్దపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా సదర్ పండుగను నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా ఆదివారం నిర్వహించిన సదర్ ఉత్సవాలతో పెద్దపల్లి జిల్లా దద్దరిల్లింది. యాదవుల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సదర్ పండుగను యాదవులందరూ కలిసి పెద్దపల్లి జిల్లాలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దీంతో పెద్దపల్లి జిల్లా కోలాహలంగా మారింది.

    యాదవులందరూ కోలాటాల నడుమ ఆడుతూ పడుతూ వైభవంగా సదర్ పండుగను నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామణారావు, ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, పెద్దపల్లి రాజా రాం యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోట్ల తిరుపతి యాదవ్, గంట రాములు యాదవ్, యాదవ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 


Similar News