రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ సత్య ప్రసాద్ వైద్యులకు సూచించారు.

దిశ, గొల్లపల్లి : ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ సత్య ప్రసాద్ వైద్యులకు సూచించారు. మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపీ, ఐపీ సేవల రికార్డ్స్, ల్యాబ్ రికార్డ్స్ పరిశీలించారు. ఆసుపత్రిలోని వైద్య సేవల గురించి పేషంట్లని అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రతి మంగవారం ఆర్యోగ మహిళా కేంద్రంలో మహిళలకు ఉచితంగా నిర్వహించే థైరాయిడ్, క్యాన్సర్, ఆస్తమా వంటి 6 రకాల వైద్య పరీక్షల వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించాలి
పంటలు ఎండిపోకుండా చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. మండలంలోని లోత్తునూరు గ్రామంలో గల డి 64 డిస్ట్రిబ్యూటరీ కెనాల్ ను మంగళవారం సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కెనాల్ లో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి, కెనాల్ కు అవసరమున్న మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. అందుకు ప్రతిపాదనలు పంపిస్తే కావలసిన నిధులు మంజూరు చేస్తానని అన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ మధుసూదన్, ఇరిగేషన్ ఈఈ ఖాన్ ,తహసీల్దార్ వరందన్, ఎంపీడీఓ రామ్ రెడ్డి, వ్యవసాయ అధికారి కరుణ పాల్గొన్నారు.