Disha Effect : హోటళ్ల పై దాడులు చేసిన అధికారులు...

హుజురాబాద్ పట్టణంలో అక్రమంగా డెమోస్టిక్ సిలిండర్లను వాడుతున్న హోటల్ పై రెవెన్యూ ,సివిల్ సప్లై ఆధికారులు సోమవారం దాడులు చేశారు.

Update: 2024-10-07 12:51 GMT

దిశ, హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్ పట్టణంలో అక్రమంగా డెమోస్టిక్ సిలిండర్లను వాడుతున్న హోటల్ పై రెవెన్యూ ,సివిల్ సప్లై ఆధికారులు సోమవారం దాడులు చేశారు. "సబ్సిడీ గ్యాస్ పక్కదారి" అనే శీర్షికన దిశ పత్రికలో గత శనివారం ప్రచురితమైంది. దీనికి స్పందించిన సివిల్ సప్లై , రెవెన్యూ అధికారులు పలు హోటళ్లపై దాడులు చేసి వంట గ్యాస్ సిలిండర్ లను 30 వరకు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో సివిల్ సప్లై డీటీలు వసంతరావు, వినోద్ ,రెవెన్యూ ఇన్స్పెక్టర్ శేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.


Similar News