Highway construction : అటుబండ - ఇటు గొయ్యి..

శంకరపట్నం మండలంలోని మొలంగూర్ క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారి నిర్మాణపు పనుల్లో భాగంగా గత 20 రోజుల క్రింద పెద్ద గొయ్యి తీసి వదిలివేశారు.

Update: 2024-07-25 15:00 GMT
Highway construction : అటుబండ - ఇటు గొయ్యి..
  • whatsapp icon

దిశ, శంకరపట్నం : శంకరపట్నం మండలంలోని మొలంగూర్ క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారి నిర్మాణపు పనుల్లో భాగంగా గత 20 రోజుల క్రింద పెద్ద గొయ్యి తీసి వదిలివేశారు. దాదాపు నెల రోజుల క్రింద హుజురాబాద్ నుండి కరీంనగర్ కు గ్రానైట్ ను తరలిస్తున్న ఓ లారీ అదుపు తప్పడంతో లారీపై ఉన్న పెద్ద గ్రానైట్ బండ రోడ్డు పక్కన పడిపోయింది. సదరు గ్రానైట్ కంపెనీ వారు లారీని తీసుకెళ్లి గ్రానైట్ బండను వదిలివేసి వెళ్లారు. దీంతో ఒకవైపు బావిలాంటి పెద్ద గొయ్యి.. మరోవైపు పెద్ద బండరాయి ఉండడంతో రాకపోకలు సాగించే వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేకాకుండా రాత్రి వేళల్లో అదుపు తప్పితే గొయ్యిలోనైనా పడవచ్చు లేదా బండరాయినైనా ఢీకొనే అవకాశం ఉన్నట్లు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే బండరాయిని తొలగించి తీసిన గొయ్యిని పూడ్చి ప్రమాదాల నుంచి వాహనదారులను రక్షించాలని కోరుతున్నారు.

Tags:    

Similar News