అంతుపట్టని వైరస్.. 6 వేల కోళ్లు మృత్యువాత
కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని లక్ష్మీదేవి పల్లి గ్రామం గంగాధర
దిశ, గంగాధర : కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని లక్ష్మీదేవి పల్లి గ్రామం గంగాధర శివారులో సుమారుగా 6 వేల కోళ్లు గురువారం రాత్రి మృత్యువాత పడ్డాయి. ఫౌల్ట్రీఫామ్ యజమాని లక్ష్మీదేవిపల్లె గ్రామానికి చెందిన ఇప్పలపల్లి నర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీదేవిపల్లె గ్రామం గంగాధర శివారులోని తన పౌల్ట్రీ ఫామ్ లో గురువారం రాత్రి బాగానే ఉన్న కోళ్లు, శుక్రవారం తెల్లవారుజాము వరకు సుమారు 6 వేల కోళ్లు చనిపోయాయి. రెండు మూడు రోజుల నుంచి ఇలాగే కోళ్లు ఫామ్ లో చనిపోతున్నాయని, కోళ్లు చనిపోవడాన్ని గమనించి వెటర్నరీ వైద్యునికి చెప్పగా వచ్చి పరిశీలించి వైరస్ సోకడం వల్ల చనిపోయినట్లు నిర్ధారించారు. చనిపోయిన కోళ్లను వెటర్నరి వైద్యుని సూచన మేరకు జేసీబీతో గుంత తవ్వి పూడ్చి పెడతామని తెలిపారు. సుమారు 6000 వరకు కోళ్లు చనిపోవడంతో పెద్ద ఎత్తున నష్టం జరిగిందని, ప్రభుత్వం తగిన నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలని బాధిత పౌల్ట్రీ యజమాని కోరారు.