MLA Padi Kaushik Reddy : అగ్ని ప్రమాద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి..
హుజురాబాద్ నడిబొడ్డున ఉన్న చిరు వ్యాపారుల షాపులు అగ్ని ప్రమాదంలో 31 షాపులు దగ్ధమై రోజులు గడుస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, యాక్షన్ డ్రామాలు ఆపి వారికి నష్టపరిహారాన్ని అందించాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.
దిశ, హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్ నడిబొడ్డున ఉన్న చిరు వ్యాపారుల షాపులు అగ్ని ప్రమాదంలో 31 షాపులు దగ్ధమై రోజులు గడుస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, యాక్షన్ డ్రామాలు ఆపి వారికి నష్టపరిహారాన్ని అందించాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం హుజురాబాద్ లోని పాపారావు బొంద వద్ద చిరు వ్యాపారులకు ఆర్థిక సాయం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. ప్రమాదం జరిగినప్పుడు వచ్చిన వారికి ఏదైతే మాట ఇచ్చాను దాని ప్రకారమే నా జీతంలో నుంచి ఒక్కో షాపునకు పదివేల చొప్పున 3 లక్షల పదివేలు ఇచ్చానని, పునర్నిర్మాణం కోసం కూడా లక్ష రూపాయలు అందించానన్నారు. ఇంత పెద్ద మొత్తంలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రభుత్వం స్పందించలేదని కనీసం మంత్రి కూడా ఇటువైపు తొంగి చూడకపోవడం సిగ్గుచేటు అన్నారు.
అగ్ని ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న వెంటనే ప్రభుత్వ అధికారులు అందరితో వచ్చి ప్రమాదం జరిగిన తీరుతో పాటు ఆస్తి నష్టాన్ని అంచనా వేయాలని చెప్పినప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వం సహాయం ఎందుకు అందించ లేదో చెప్పాలని అన్నారు. దీంతో పాటు పాపారావు బృందం పై క్లియరెన్స్ తీసుకొని వాళ్లకు పర్మినెంట్ షెల్టర్లు వేయాలని ఆయన అన్నారు. చిరు వ్యాపారుల నష్టపరిహారం పై ప్రభుత్వం స్పందించక పోతే అసెంబ్లీ సెషన్ లో ఆగుతానని అప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీలు ఇచ్చి వారికి సాయం అందించకపోతే తర్వాత తీవ్రపరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.
అలాగే గత మూడు రోజులుగా హుజురాబాద్ నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురియడంతో నియోజకవర్గంలోని వీణవంక మండలం మామిడాలపల్లి ఆమ్లెట్ గ్రామమైన గొల్లపల్లిలోని బ్రిడ్జ్ పూర్తిగా పాడైపోయిందని, దీంతో రాకపోకలు కూడా నిలిచిపోయాయని, మాచన పెళ్లి గ్రామంలో ఊరు కుంట చెరువు తెగిపోయే ప్రమాదం ఉందని, వెంటనే మరమ్మత్తులు చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. అదేవిధంగా పెద్ద పాపాయిపల్లి ఎల్లమ్మ చెరువు కూడా నీరు ఎక్కువై పోతుందని, కట్టతెగే ప్రమాదం ఉందని దానికి మరమ్మతు చేయాలని డిమాండ్ చేశారు. పట్టణంలోని బుడిగే జంగాల కాలనీ మొత్తం వర్షాలతో అతలాకుతలమైందని వారికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, ఎంపీపీ రాణి సురేందర్ రెడ్డి, కౌన్సిలర్లు ప్రతాప తీర్మాల్ రెడ్డి, కేశిరెడ్డి లావణ్య, నరసింహారెడ్డి, మొలుగు సృజన పూర్ణచందర్, రమాదేవి, అపరాధ ముత్యం రాజు, ప్రతాప మంజూల కృష్ణ, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.