విద్యతోనే సమాజంలో గుర్తింపు: MLA Rasamayi Balakishan
భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దామని తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక...MLA Bala kishan Speech
దిశ, శంకరపట్నం: భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దామని తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక రథసారథి చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం, కన్నాపూర్ గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే బాలకిషన్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శంకరపట్నం మండలంలోని తాడికల్, కేశవపట్నం, కల్వల, కన్నాపూర్ గ్రామాల్లో, ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు వేసి వర్ధంతి వేడుకలను నివాళి అర్పించి ఘనంగా వర్ధంతి వేడుకలను నిర్వహించారు. గద్దపాక, అర్కoడ్ల లో రేషన్ దుకాణాలను, కన్నాపూర్ గ్రామంలో రజక ,యాదవ కమ్యూనిటీ భవనాలు, పాల కేంద్రాన్ని, అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించి ఎమ్మెల్యే మాట్లాడారు.
యావత్ భారత దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ బహుజనుల కోసం భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ రాజ్యాంగం రచించి బహుజనుల అభివృద్ధి కోసం రిజర్వేషన్ల ను పొందుపరిచారని, సాహెబ్ కల్పించిన రిజర్వేషన్ల ఫలితంగానే నేను ఎమ్మెల్యేను, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బహుజనులు, వివిధ పదవుల్లో, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పొందుతున్నామని, ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదివి అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని యువతకు, విద్యార్థులకు సూచించారు. కన్నాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ కాటం వెంకట రమణారెడ్డి ఎమ్మెల్యే బాలకిషన్ అండతో, సుమారు 2 కోట్ల రూపాయలకు పైన నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేశానని, కన్నాపూర్ ధర్మారం గ్రామాల మరింత అభివృద్ధి పథంలోకి ఎమ్మెల్యే ఎండతో తీసుకెళ్తానని చెప్పారు. ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా రసమయి బాలకిషన్ గెలిపించుకోవాలని సర్పంచ్, జెడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాసరెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ సరోజన, వైస్ ఎంపీపీ రమేష్, పంచులు కాటం వెంకట రమణారెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, సుజాత, రజిత, రేణుక, భద్రయ్య, రాజయ్య ఎంపీటీసీలు మోతే భాగ్యలక్ష్మి ఎల్లారెడ్డి, వరలక్ష్మి సంపత్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంట మహిపాల్, అంబేద్కర్ సంఘ నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు, టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.