నా గోడు విను కేటీఆర్ అన్నా.. చంటి బిడ్డతో మహిళ ఆర్తనాదాలు

మంగళవారం మంత్రి కేటీఆర్ సిరిసిల్ల పర్యటన ముగించుకుని హెలిప్యాడ్

Update: 2023-10-03 14:56 GMT

దిశ, సిరిసిల్ల : మంగళవారం మంత్రి కేటీఆర్ సిరిసిల్ల పర్యటన ముగించుకుని హెలిప్యాడ్ వద్దకు వెళ్తున్న క్రమంలో తన కారు వద్ద 'అన్నా నా గోడు విను అన్నా' అంటూ ఓ మహిళ ఆర్తనాదాలు చేసింది. చంటి బిడ్డతో అంతమందిలో నలుగుతూ దాదాపు 50 సార్లైనా కేటీఆర్ ను అన్నా అన్నా అంటూ అర్థిస్తూ పిలిచింది. దాదాపు ఒక మీటరు దూరంలో ఉన్న మంత్రి కేటీఆర్ ఆ మహిళ మాటలు విడిపించనట్లే కారు ఎక్కి వెళ్లిపోయారు. చేసేదేమీ లేక ఆ మహిళ నిరాశతో వెనుదిరిగింది. అక్కడే జరిగిన సభలో సిరిసిల్ల ప్రజల ప్రజలు తనకు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తేనే మంత్రినై దేశంలో, ప్రపంచంలో ఎంతో గౌరవం దక్కుతుందని మంత్రి చెప్పారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజల సమస్యలు మంత్రి వినకుండా, అందులో ఒక మహిళ పిలుపును లెక్కచేయకుండా వెళ్లిపోవడం పలువురిని విస్మయానికి గురిచేసింది.

Tags:    

Similar News