డబుల్ బెడ్ రూం ఇళ్లను త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

డబుల్ బెడ్ రూం ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ సంబంధిత.... Meeting with officers

Update: 2023-03-01 13:17 GMT

దిశ, పెద్దపల్లి కలెక్టరేట్: డబుల్ బెడ్ రూం ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో అదనపు కలెక్టర్ వి. లక్ష్మీనారాయణతో కలిసి జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పురోగతి పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షిస్తూ మాట్లాడుతూ, పూర్తి అయిన ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని, జిల్లాలో మొత్తం 3394 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు గాను, పంచాయతీ రాజ్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 1444, ఆర్ అండ్ బీ ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 1460, టి.ఎస్.ఈ.డబ్ల్యూ. ఐ.డి.సి. ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 490 ఇల్లు పూర్తి చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు పంచాయతీ రాజ్ ద్వారా 92, ఆర్ అండ్ బీ ద్వారా 170, మొత్తం 262 ఇళ్లు పూర్తి చేయగా, 1704 ఇళ్ల పనులు పురోగతిలో ఉన్నాయని, 1428 ఇళ్ల పనులు ప్రారంభించాల్సి ఉన్నదని తెలిపారు.

నిర్మాణంలో ఉన్న పనులకు సిమెంట్ లభ్యత వివరాలను, ఇప్పటికీ పనులు ప్రారంభించకపోవడానికి కారణాలు, పురోగతిలో ఉన్న పనులు ఎప్పటివరకు పూర్తి దశలో అవుతాయని, వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పురోగతిలో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పూర్తి అయిన ఇళ్లలో మౌళిక సదుపాయాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, మౌళిక వసతుల కల్పనకు ఎంత మేరకు పూర్తి అయినాయి, ఇంకను ఏఏ పనులు అవసరం ఉన్నాయి.. ప్రతిపాదనలు సమర్పించాలని తెలిపారు. పనులలో నాణ్యత పాటించాలని, నిరంతరం పర్యవేక్షణ చేస్తూ త్వరగా పూర్తి చేయాలని, ఫ్లోరింగ్, కిటికీలు, తలుపుల ఏర్పాటు, డ్రైనేజ్, ఇంటర్నల్ రోడ్ పనులు, విద్యుత్ కనెక్షన్ లు ఇవ్వాలని, మిషన్ భగీరథ నీటి సౌకర్యం కల్పించాలని, సంపులు, సింటెక్స్ టాంక్, వీధి దీపాలు ఏర్పాటు, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా మౌళిక సౌకర్యాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.

డబుల్ బెడ్రూం పనులకు సంబంధించి బిల్లులు చెల్లించడం జరిగిందని, ఇంకను చెల్లించవలసిన వాటి వివరాలు సమర్పించాలని అన్నారు. ఈ సమావేశంలో పెద్దపల్లి ఆర్డీవో వెంకట మాధవరావు, మంథని ఆర్డీవో వీరబ్రహ్మచారి, పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డబుల్ బెడ్ రూం నోడల్ అధికారి కనకరత్నం, ఆర్ అండ్ బీ - ఈఈ నరసింహచారి, తహశీల్దార్లు, ఆర్ అండ్ బీ, పీఆర్-డి.ఈలు, సోషల్ వెల్ఫేర్ ఏఈ నర్సయ్య, వెరిఫికేషన్ టీమ్ మెంబర్లు, కలెక్టరేట్ సెక్షన్ అధికారి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News